కన్నప్ప రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే?

by velandi.Saikiran |

టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు ( Manchu vishnu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా అసోసియేషన్ పెద్దగా

కన్నప్ప రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు ( Manchu vishnu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా అసోసియేషన్ పెద్దగా కొనసాగుతూనే... ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా ముందుకు సాగుతున్నారు. అయితే అలాంటి హీరో విష్ణు.. ఇప్పుడు భక్తి కథ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కన్నప్ప ( Kannappa Movie) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ప్రేక్షకుల ముందుకు వచ్చారు హీరో మంచి విష్ణు.

ఈ సినిమాలో హీరో మంచు విష్ణు, రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas), మంచు మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ లాంటి కీలక నటీనటులు ఉన్నారు. అయితే వీరందరి కాంబినేషన్ లో వచ్చిన కన్నప్ప సినిమా బాక్సాఫీస్ ముందు దూసుకు వెళ్తోంది. మన శుక్రవారం రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

మంచు విష్ణు హీరోగా చేసిన కన్నప్ప సినిమా రెండు రోజుల్లో 42.5 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొదటి రోజు 20 కోట్లు వసూలు చేసిన కన్నప్ప సినిమా రెండోరోజు 22.5 కోట్లు తీసుకువచ్చిందట. ఇవాళ సండే కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు సినీ ప్రముఖులు. ఇదే అడ్వాన్స్ తో ఈ మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఉన్నాయి.

Next Story