శ్రీమఠంలో సినీ హీరో శివరాజ్ కుమార్ సందడి

by Bhoopathi Nagaiah |

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని కన్నడప్రముఖ సినీ హీరో శివరాజ్ కుమార్ ( Shivraj Kumar) దర్శించుకున్నారు.

శ్రీమఠంలో సినీ హీరో శివరాజ్ కుమార్ సందడి
X

దిశ, మంత్రాలయం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం(Manthralayam) శ్రీ రాఘవేంద్ర స్వామిని కన్నడ(Kannada Film Industry) ప్రముఖ సినీ హీరో డాక్టర్ రాజ్ కుమార్ కుమారుడు, పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ( Shivraj Kumar) దర్శించుకున్నారు. శివరాజ్ కుమార్‌కు శ్రీ మఠం(Sri Math) అధికారులు ఆలయ మర్యాదలకు ఘన స్వాగతం పలికారు. శివ రాజ్ కుమార్ ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని అనంతరం శ్రీ రాయర మూల బృందావనం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ మఠంలో సినిమా షూట్ కోసం వచ్చామన్నారు. నేను మా నాన్న గారితో పాటు ఎన్నోసార్లు మంత్రాలయం వచ్చానని గుర్తు చేసుకున్నారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం మాకు మరో ఇల్లు లాంటిదట్టు ఆయన పేర్కొన్నారు. శివ రాజ్ కుమార్‌కు ఈ మఠం పీఠాధిపతి శ్రీ సుభూదేంద్ర తీర్థ స్వామీజీ స్వామి వారి ఆశీస్సులు అందజేసి స్వామివారి మెమెంటో, శేష వస్త్రం, ఫలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు.

Next Story