కమల్ హాసన్ వివాదంపై స్పందించిన కన్నడ నటి.. ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలంటూ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-30 12:01:44  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) ‘థగ్‌లైఫ్’ (Thuglife)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

కమల్ హాసన్ వివాదంపై స్పందించిన కన్నడ నటి.. ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలంటూ ట్వీట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) ‘థగ్‌లైఫ్’ (Thuglife)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష, శింబు, ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi), అభిరామి, రవి మోహన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య జూన్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇక ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. ఓ ఈవెంట్‌లో భాగంగా కన్నడ గురించి పలు వివాదాస్పద కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు దుమారం రేపాయి. అధికార, విపక్ష పార్టీలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా కమల్ క్షమాపణలు చెప్పకపోతే ‘థగ్‌లైఫ్’ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఇటీవల ఈ వివాదంపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీవ్రంగా స్పందించింది. మే 30 లోగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, కన్నడ నటి రమ్య(divyaspandana)ఈ విషయంపై స్పందించి ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘మన భాషలకు సారూప్యతలు ఉన్నాయి. కానీ ఏ భాష మరొకదాని కంటే గొప్పది కాదు. సంస్కృతాన్ని అన్ని భాషలకు తల్లిగా భావించే వారు ఇప్పటికీ ఉన్నారు. కానీ అది కూడా నిజం కాదు.

ఎందుకంటే సంస్కృతం ఇండో-ఆర్యన్ భాష. కానీ మేము ద్రావిడులము. ఇండో ఆర్యన్లు ఇక్కడికి వలస రావడానికి చాలాకాలం ముందే మేము ఇక్కడ ఉన్నాము. కమల్ హాసన్ ఒక ఆవేశపూరిత ప్రకటన చేశారు. కానీ ఆ కారణంగానే ఆయనను నిషేధించడం కొంచెం అతిగా అనిపించడం లేదా? మనమందరం కలిసి హిందీ భాషా విధానానికి వ్యతిరేకంగా పోరాడాలి. కానీ దానికి ముందు మనం ఒకరినొకరు గౌవించడం నేర్చుకోవాలి. తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం భాషలు ద్రావిడ భాష నుంచి ఉద్భవించాయి. కన్నడ, తెలుగు, తమిళం, మలయాల భాషలు ద్రావిడ కిందకు వస్తాయి’’ అని రాసుకొచ్చింది. అలాగే ఓ పట్టికను కూడా షేర్ చేసింది.

Next Story