నేను ఇక్కడ బతకలేను.. నాకు విషం ఇచ్చి చంపేయండి.. నటుడు ఆవేదన (పోస్ట్)

by Chukka Sudharani |

కన్నడ నటుడు దర్శన్‌కు ఇటీవల సుప్రీం కోర్డు బెయిల్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

నేను ఇక్కడ బతకలేను.. నాకు విషం ఇచ్చి చంపేయండి.. నటుడు ఆవేదన (పోస్ట్)
X

దిశ, సినిమా: కన్నడ నటుడు దర్శన్‌కు ఇటీవల సుప్రీం కోర్డు బెయిల్ రద్దు చేసిన విషయం తెలిసిందే. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును రద్దు చేస్తూ జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహేదేవన్‌లతో కూడిన న్యాయస్థానం బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ మళ్లీ జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే జైలు జీవితాన్ని భరించలేని ఈ నటుడు.. నాకు విషమిచ్చి చంపేయండి అంటూ న్యాయమూర్తి ముందు వాపోయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. అందులో.. ‘జైల్లో ఉండలేకపోతున్నా.. నాకు విషమిచ్చి చంపేయండి. జైలు గదిలోకి ఎండ రావడం లేదు.. గదిలో దుస్తుల దుర్వాసన వస్తుంది. రూంలో మొత్తం ఫంగస్ పట్టింది.. ఇక్కడ జీవితం అత్యంత దుర్భరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను బ్రతకలేను.. నాకు విషమివ్వండి’ అంటూ న్యాయమూర్తి ముందు కన్నడ హీరో దర్శన్ వాపోయినట్లు పలు పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై కొందరు దర్శన్‌కు సపోర్ట్‌గా రిప్లైలు ఇస్తుంటే.. మరికొందరు మాత్రం నెగిటివ్‌గా స్పందిస్తున్నారు.




Next Story