- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Renukaswamy Murder Case: కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్
కన్నడ నటుడు దర్శన్(Actor Darshan)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ నటుడు దర్శన్(Actor Darshan)ను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయన్ను గురువారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీం కోర్టు (Supreme Court) రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును పక్కనపెడుతూ జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ మంజూరు విచారణ, సాక్షులపై ప్రభావం చూపుతుందని.. తక్షణమే దర్శన్‌ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మధ్యాహ్నం అరెస్ట్ చేశారు.
Next Story






