'Emergency' : ఓటీటీలోకి కంగనా 'ఎమర్జెన్సీ' !

by Y. Venkata Narasimha Reddy |

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gandhi) రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని స్వీయ దర్శకత్వంలో హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut)తెరకెక్కించిన 'ఎమర్జెన్సీ' (Emergency)చిత్రం త్వరలోనే ఓటీటీ(OTT)లో స్ట్రీమింగ్ కానుంది.

Emergency : ఓటీటీలోకి కంగనా ఎమర్జెన్సీ !
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gandhi) రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని స్వీయ దర్శకత్వంలో హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut)తెరకెక్కించిన 'ఎమర్జెన్సీ' (Emergency)చిత్రం త్వరలోనే ఓటీటీ(OTT)లో స్ట్రీమింగ్ కానుంది. ఇందిరా గాంధీ తన పాలనా కాలంలో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి సందర్భాన్ని ఆధారంగా చేసుకొని కంగనా ఈ ఎమర్జన్సీ సినిమాను రూపొందించారు.

ఇందిరాగాంధీగా కంగనా నటించగా.. జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్ పేయిగా శ్రేయాస్ తల్పడే నటించారు. 'ఎమర్జెన్సీ' చిత్రం వివాదాలలో చిక్కుకుని పలుమార్లు విడుదల వాయిదా పడుతూ చివరకు జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'ఎమర్జెన్సీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. రూ.60 కోట్లతో ఈ సినిమాను రూపొందించగా.. రూ.21 కోట్లు మాత్రమే రాబట్టినట్లు సమాచారం.

బాక్సాఫీస్ వద్ధ కలెక్షన్ల సాధనలో విఫలమైన ఎమర్జన్సీ చిత్రం రాజకీయంగా మాత్రం మంచి గుర్తింపు దక్కించుకుంది. త్వరలో 'ఎమర్జెన్సీ' చిత్రం ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని కంగనా తాజాగా ప్రకటించారు. ఇన్ స్ట్రా వేదికగా 'ఎమర్జెన్సీ' ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నెటిఫ్లిక్స్ వేదికగా మార్చి 17 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుందని కంగనా రౌనత్ తెలిపారు.

Next Story