- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kangana Ranaut: కుంభమేళా బ్యూటీ మోనాలిసా అందంపై రియాక్ట్ అయిన కంగనా.. వారిని కూడా గుర్తించండి అంటూ సెన్సేషనల్ పోస్ట్
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా(Mona Lisa) అనే అమ్మాయి రుద్రాక్ష మాలలు అమ్ముతూ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా(Mona Lisa) అనే అమ్మాయి రుద్రాక్ష మాలలు అమ్ముతూ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. తన అందం తేనే కళ్లతో కట్టి పడేసి.. అమాయకపు చూపులతో మోనాలిసా ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. పెద్ద ఎత్తున ఆమె వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయనడంలో అతిశయోక్తి లేదు. అతి సాధారణ యువతి తన సహజ సౌందర్యంతో అందరినీ కట్టిపడేసి స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ దక్కించుకుంది. చాలా మంది ఆమెతో ఫొటోలు తీసుకునేందుకు కూడా ఎగబడ్డారు. గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా మోనాలిసాకు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నారు.
ఇక కుర్రాళ్లు అయితే ఆమెను పెళ్లి కూడా చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపించారు. అయితే ఈ క్రేజ్ చూసిన సినీ సెలబ్రిటీలు సినిమాల్లోకి కూడా తీసుకోవాలని అనుకున్నారట. మోనాలిసాకు ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) మూవీలో ఆఫర్ వచ్చినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, మోనాలిసా అందంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut)ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘కుంభమేళాలో మోనాలిసాతో చాలామంది ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. వారి తీరును చూస్తుంటే చాలా బాధేస్తుంది. అక్కడి వారు ప్రవర్తించిన పద్ధతి ఎంతమాత్రం బాగాలేదు. అలాంటి వారిని ద్వేషించడం తప్ప ఏం చేయలేము.
మన చిత్ర పరిశ్రమలో కూడా చాలామంది హీరోయిన్లు ఆమె రంగులోనే ఉన్నారు. వారందరిపై కూడా ఇలాంటి అభిమానమే చూపుతున్నారా? బాలీవుడ్ స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న దీపికా పదుకొణె(Deepika Padukone), కాజోల్(Kajol Aggarwal) వంటి వారిపై చూపుతున్న అభిమానాన్నే కొత్తగా వచ్చే హీరోయిన్లపై చూపుతున్నారా?. మోనాలిసాను భారీగా వైరల్ చేస్తున్నట్లే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరోయిన్లపై కూడా మీ ప్రేమాభిమానాలు చూపించగలరా? కొత్త వారిని కూడా కాస్త గుర్తించండి’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆమె ఫొటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం కంగనా పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. ఇక అది చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు కంగనాకు సపోర్ట్‌గా ఉంటే మరికొందరు మాత్రం సాధారణ అమ్మాయిపై కుళ్లు చూపిస్తుందని అంటున్నారు.






