- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kangana Ranaut: ఇండస్ట్రీ ఒక డర్టీ ప్లేస్.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఫేమస్ హీరోయిన్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. నిత్యం ఏదో ఒక విషయంపై మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. నిత్యం ఏదో ఒక విషయంపై మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు, దేశంలో జరుగుతున్న కొన్ని ఘటనలపై కూడా నేరుగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ సంచలనం సృష్టిస్తూ ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కంగనా అప్పుడప్పుడు భారీగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది. అయినా పట్టించుకోని ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మరోసారి ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
మొదటి స్త్రీ పుట్టుక గురించి మాట్లాడుతూ.. ‘స్త్రీ అనేది పుట్టుక ద్వారా డిసైడ్ చేయబడింది కాదు.. మనం పెంపొందించుకునే బలం, పోరాడే శక్తి, నిలబడే ధైర్యం బట్టి అది నిర్వచింబడుతుంది. అలాగే ఒక స్త్రీగా మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే.. తీసుకునే నిర్ణాయాలు, ఎంచుకునే దారిని బట్టి అది డిసైడ్ అవుతుంది’ అని తెలిపింది. ఇక ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. ‘సినిమా పరిశ్రమ ఒక డర్టీ ప్లేస్. అందులో నుంచి వచ్చిన వాళ్లకు మాత్రమే అది ఉపయోగపడుతుంది కానీ, సాధారణ వ్యక్తుల పట్ల అది దయ లేకుండా ప్రవర్తిస్తుంది. అందుకే ఇండస్ట్రీ ఒక మురికి ప్రదేశంగా నేను భావిస్తాను’ అంటూ తెలిపింది. లింక్






