- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ కిడ్ చేసిన అవమానంతో ఏడ్చిన కంగనా రనౌత్
నీనా గుప్తా కూతురు, స్టార్ కిడ్ మసాబా గుప్తా గురించి కంగనా రనౌత్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో ‘కమ్యూనల్ బయాస్(మతపరమైన వివక్ష)’ టాపిక్ విషయంలో స్పందించింది.

దిశ, సినిమా : నీనా గుప్తా కూతురు, స్టార్ కిడ్ మసాబా గుప్తా గురించి కంగనా రనౌత్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో ‘కమ్యూనల్ బయాస్(మతపరమైన వివక్ష)’ గురించి AR రెహమాన్ చేసిన కామెంట్లకు ప్రతిస్పందనగా ఈ ఓల్డ్ ఇన్సిడెంట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. తన ఫిల్మ్ Tejas ప్రమోషన్స్ కోసం మసాబా గుప్తా డిజైన్ చేసిన శారీని స్టైలిస్ట్ ద్వారా తీసుకుంది కంగన. తర్వాత ఆ శారీని రామ్ జన్మభూమి (అయోధ్య) దర్శనానికి వెళ్లేటప్పుడు ధరించాలనుంది. కానీ మసాబా గుప్తా దీన్ని వ్యతిరేకించిందని.. కానీ అప్పటికే కంగన లక్నో నుంచి అయోధ్యకు బయలుదేరిపోవడంతో శారీ మార్చుకోలేకపోయిందని.. అవమానంతో కారులో కూర్చుని ఏడ్చినట్లు చెప్పుకొచ్చింది. ఆ హేట్, బిట్టర్‌నెస్, ప్రెజుడిస్ గుర్తుచేసుకుంటే వికారంగా అనిపిస్తుందని రాసుకొచ్చింది కంగన. డిజైనర్లు సెలబ్రిటీలు తమ బ్రాండ్ వేసుకుంటే చాలా ఆనందిస్తారు.. కానీ మసాబా ఆ ఫోటోలను ఎందుకు ఉపయోగించలేదు? ఎందుకు ట్యాగ్ చేయమని చెప్పలేదు? అని ప్రశ్నించింది.






