- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీక్రెట్‌గా పెళ్లి?.. ఫైనల్‌గా ఇన్‌స్టా వేదికగా స్పందించిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్
పెళ్లి చేసుకుంది అంటూ వస్తున్న వార్తలపై కంగన ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చింది.

దిశ, సినిమా: ఏదో ఒక ఇష్యూతో నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తాజాగా షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్య పరిచింది. ఈ మేరకు కంగనా ఓ ఇంట్లో నుంచి వస్తున్న వీడియో కలకలం రేపింది. ఆ వీడియోలో ఈ నటి తన చేతికి మట్టి గాజులతో పాటు మెడలో నల్లపూజల దండ ధరించి ఉంది. సాధారణంగా హిందూ సాంప్రదాయంలో పెళ్లయిన స్త్రీలు ధరించే మాదిరిగా నల్లపూసల దండ, చేతికి మట్టిగాజుల్ని ధరించి కనిపించడంతో కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? భర్త ఎవరు? మెడలో ఉన్న మంగళ సూత్రం వెనుక కారణం ఏంటీ? అంటూ నెటిజన్లు నెట్టింట కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. అయితే.. ఈ విషయంపై ఎంతోసేపు సస్పెన్స్ ఉండనివ్వని ఈ అమ్మడు తన ఇన్‌స్టా వేదికగా క్లారిటీ ఇచ్చేసింది. అయితే తన హిట్ మూవీ క్వీన్‌కి సీక్వెల్‌గా క్వీన్ 2లో కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసమే ఇలా రెడీ అయ్యారంటూ క్లారిటీ ఇస్తూ.. ‘నేను ప్రతిరోజూ నగరంలో, దాని పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌లో పాల్గొంటున్నాను. సినిమా క్యారెక్టర్ మేకప్లో ఉన్న సమయంలో ఎవరో యాదృచ్ఛికంగా ఈ ఫోటో తీశారు. ఇప్పుడు దీనిపై నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయితే పెళ్లైన మహిళలా కనిపించడంలో అంత పెద్ద విషయం ఏముంది? నటీనటులు అన్ని రకాల పాత్రలు పోషిస్తారు. నేను మాత్రం రహస్యంగా పెళ్లి చేసుకోను.. మీకు మాట ఇస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.






