- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kanchana: 15 ఏళ్ల క్రితం నాటి సినిమాకు ఊర మాస్ రెస్పాన్స్
కాంచన సినిమాని మార్చి 13వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన టికెట్లు బుక్ మై షోలో ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. వాటికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: హర్రర్ కామెడీ సినిమాలలో ట్రెండ్ సెట్టర్ అయిన కాంచన సినిమా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహించాడు. లక్ష్మీ రాయ్ ఇందులో హీరోయిన్గా నటించింది. శరత్ కుమార్, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. 2011లో విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ మూవీ ద్వారా నటుడిగా, దర్శకుడిగా రాఘవ లారెన్స్ కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చాలా సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా కాంచన మూవీని మార్చి 13వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో, ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది.
బుక్ మై షో యాప్లో ఈ మూవీ టికెట్లు హాట్ కేక్ మాదిరి అమ్ముడుపోతున్నాయి. దానితో చాలామంది 15 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమాకు ఇప్పుడు ఇంత క్రేజ్ అంటే అది మామూలు విషయం కాదు అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి చూస్తే రీ రిలీజ్ సినిమాలలో ఈ మూవీ సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి అని చాలామంది భావిస్తున్నారు.






