- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kanchana-4: 'కాంచన-4' షూటింగ్ స్టార్ట్.. హైప్ పెంచుతున్న న్యూస్
స్టార్ హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) దర్శకత్వం వహించి, నటించిన చిత్రం ‘ముని’(Muni). 2007లో విడుదలైన ఈ సినిమా ఓకే ఓకే అనిపించుకుంది.

దిశ, సినిమా: స్టార్ హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) దర్శకత్వం వహించి, నటించిన చిత్రం ‘ముని’(Muni). 2007లో విడుదలైన ఈ సినిమా ఓకే ఓకే అనిపించుకుంది. ఇక దానికి సీక్వెల్‌గా 2011లో ‘కాంచన’(Kanchana) మూవీ అందించాడు లారెన్స్. ఈ సినిమా మాత్రం తెలుగు, తమిళంలోనూ మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా అర్ధనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్(Sarathkumar), లారెన్స్ నటనకు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో ఆ సినిమాకు సిక్వెల్‌గా 2015లో వచ్చిన ‘గంగ’(Ganga) (కాంచన 3) కూడా సూపర్ హిట్ అయింది.
ఇక ఇప్పుడు ఆ హిట్ ఫ్రాంఛైజీ నుంచి ‘కాంచన 4’(Kanchana-4)ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీనిని గోల్డ్ మైన్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లు కనిపించనుండగా.. ఓ పాత్రకోసం ఇప్పటికే పూజా హెగ్డే(Pooja Hegde) ఫిక్స్ అయింది. అలాగే మరో పాత్ర కోసం బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi) కూడా సెలక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..
కాంచన-4 సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూట్ స్టార్ అవుతుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ షూట్‌ను స్టార్ట్ చేశాడు హీరో రాఘవ లారెన్స్. కాంచన మునుపటి సిరీస్‌ల కంటే కాంచన-4ను అత్యంత భారీగా దాదాపు వంద కోట్ల భారీ బడ్జేట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమాతో లారెన్స్ ఎలాంటి హిట్ వేసుకుంటాడో చూడాల్సి ఉంది.






