- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిగ్గుచేటు, పూర్తిగా చెడిపోయిన మహిళ.. జయబచ్చన్‌పై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
నటి, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఢిల్లీలో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: నటి, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఢిల్లీలో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫీ కోసం ఆశతో వచ్చిన అభిమానిని తోసేసి ఏం చేస్తున్నావ్ అంటూ అరిచి పక్కకు నెట్టేశారు. దీంతో ఆయన స్వారీ చెప్పి పక్కకు జరగ్గా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జయా బచ్చన్ ప్రవర్తన పై బాలీవుడ్ ప్రేక్షకులు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రెటీ అయినంత మాత్రాన సెల్ఫీ కోసం వస్తే అంతలా రెచ్చిపోవాలా అని విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఇదే విషయంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాలా చెడిపోయిన మహిళ..ఒక స్పెషల్ మహిళ అంటూ విమర్శించారు. అమితా బచ్చన్ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను అర్థం లేని మాటలను సహిస్తున్నారని పేర్కొన్నారు. సమాజ్ వాదీ పార్టీ టోపి కోడి జుట్టులా కనిపిస్తుందని, ఆమె పోరాటానికి సిద్ధమైన కోడి పుంజులా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఎంత అవమానకరం, సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.






