KH x RK Reunion : కమల్ - రజినీ మల్టీస్టారర్ గ్లింప్స్ రిలీజ్

by Pulgam srinivas |

KH x RK Reunion : కమల్ - రజినీ మల్టీస్టారర్ గ్లింప్స్ రిలీజ్.. ఫాన్స్ కి ఫుల్ కిక్

KH x RK Reunion : కమల్ - రజినీ మల్టీస్టారర్ గ్లింప్స్ రిలీజ్
X

దిశా వెబ్ డెస్క్ : తమిళ స్టార్ నటులు లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి దాదాపు 46 ఏళ్ల తర్వాత ఓ సినిమాలో నటించబోతున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనుండగా, అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నాడు. తాజాగా వీరిద్దరూ కలిసి నటించబోయే సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన వీడియోలో మొదటగా ఈ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, అనిరుద్ రవిచంద్రన్ కనిపించారు. ఆ తర్వాత కమల్, రజినీ కనిపించారు. వీరు నలుగురు కూడా ఈ వీడియో సరదాగా సాగేలా చూశారు. మొత్తానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబో మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియో వచ్చేసింది. ప్రస్తుతానికి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Next Story