కమల్ - రజినీ కాంబో మూవీ నుండి సాలిడ్ అప్‌డేట్ వచ్చేసింది

by Pulgam srinivas |

కమల్ - రజనీకాంత్ మూవీ నుండి ఫిబ్రవరి 21న సూపర్ అప్డేట్ రానుంది.

కమల్ - రజినీ కాంబో మూవీ నుండి సాలిడ్ అప్‌డేట్ వచ్చేసింది
X

దిశ, వెబ్ డెస్క్ : కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయిన రజనీకాంత్, కమలహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో నటించి, అనేక విజయాలను అందుకొని, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి గొప్ప క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో నటించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీని చాలా సంవత్సరాల పాటు రూల్ చేసిన ఈ ఇద్దరు ఇప్పుడు ఒకే సినిమాలో నటించడానికి రెడీ అయ్యారు.




ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మించబోతున్నాడు. సిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా ఈ క్రేజీ మూవీకి సంబంధించిన సూపర్ సాలిడ్ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను ఫిబ్రవరి 21వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. మరి ఈ మూవీ యూనిట్ ఎలాంటి అనౌన్స్‌మెంట్ విడుదల చేస్తుందా అని ఎంతోమంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Next Story