తమిళ్ కన్నడ వివాదం..మరోసారి కమల్ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

త‌మిళం నుండే క‌న్న‌డ పుట్టుకొచ్చింది అంటూ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది.

తమిళ్ కన్నడ వివాదం..మరోసారి కమల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: త‌మిళం నుండే క‌న్న‌డ పుట్టుకొచ్చింది అంటూ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. క‌మ‌ల్ హాస‌న్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని క‌న్న‌డ ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తుంటే క‌మ‌ల్ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డంలేదు. క‌మ‌ల్ హాస‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే థ‌గ్ లైఫ్ సినిమా విడుద‌ల‌ను అడ్డుకుంటామ‌ని క‌ర్నాట‌క ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్ర‌క‌టించ‌డంతో ఈ విష‌యం మ‌రింత హాట్ టాపిక్ గా మారింది.

దీనిపై మ‌రోసారి క‌మ‌ల్ స్పందించారు. తాను ఏదైనా విష‌యంలో తప్పు చేస్తే క‌చ్చితంగా క్ష‌మాప‌ణ చెబుతాన‌ని అన్నారు. త‌ప్పు చేయ‌న‌ప్పుడు క్ష‌మాప‌ణ చెప్ప‌ను అని ఇది త‌న ప‌ద్ద‌తి అని స్ప‌ష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా కర్నాటకలో భాషా ఉద్యమం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవలే ఓ బ్యాంకు ఉద్యోగి కన్నడ మాట్లాడను అంటూ కస్టమర్‌తో గొడవకు దిగింది. దీనిపై సీఎం సైతం స్పందించాల్సి వచ్చింది. ఈ వివాదం ముగిసేలోపే కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మరోసారి అగ్గిలో అజ్యం పోసినట్టయ్యింది.

Next Story