నటుడు రజినీకాంత్‌ను కలిసిన కమల్ హాసన్.. నెట్టింట్లో ఫొటోలు వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-16 07:23:40  IST  )

మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ఇవాళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

నటుడు రజినీకాంత్‌ను కలిసిన కమల్ హాసన్.. నెట్టింట్లో ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ఇవాళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు కమల్ హాసన్ ఆయనను కలిసిన ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభకు ఎన్నికైన కమల్‌ను సూపర్‌స్టార్ అభినందించారు. అయితే, రజినీకాంత్‌ను హగ్ చేసుకున్న ఫొటోలను ట్యాగ్ చేస్తూ ‘నా స్నేహితుడు రజనీకాంత్‌తో నా కొత్త ప్రయాణం గురించిన విషయాన్ని పంచుకున్నా. నేను చాలా సంతోషించా’ అంటూ కమల్ హాసన్ కామెంట్ చేశారు. కాగా, మక్కల్ నీది మయ్యమ్ నాయకుడు కమల్ హాసన్, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)తో పొత్తు పెట్టకున్న విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు నామినేషన్ దాఖలు చేసిన ఆయన పోటీ లేకుండానే ఏకగ్రీవంగా రాజసభకు ఎంపికయ్యారు.

Kamal Hasan Tweet: https://x.com/ikamalhaasan/status/1945365172648075500

Next Story