- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందాల ఆరబోతలో స్టార్ హీరోయిన్లకూ పోటీగా నిలుస్తున్న కామాక్షి భాస్కర్ల
డాక్టర్ నుంచి హీరోయిన్‌గా మారిన కామాక్షి… సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ ప్రేమికులకి కామాక్షి భాస్కర్ల పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ‘ప్రియురాలు’ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. చైనాలో ఎంబిబిఎస్ పూర్తి చేసిన ఈమె కొంతకాలం పాటు అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేసింది.
అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈమెకు ‘మా ఊరి పొలిమేర’ చిత్రంతో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత అదే చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది.
అనంతరం పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కొంతకాలం క్రితం అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ‘12A రైల్వే కాలనీ’ చిత్రంలో ఈమె హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
కెరీర్ ప్రారంభం నుంచే కామాక్షి భాస్కర్ల తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది.
పేరుకు చిన్న హీరోయిన్ అయినప్పటికీ, స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని విధంగా అందాలను మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. తాజాగా కామాక్షి భాస్కర్ల తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలలో ఆమె వైట్ కలర్ పలుచటి శారీ ధరించి, అందుకు తగిన స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో క్లాస్ లుక్‌తో జడ వేసుకొని నవ్వుతూ ఫ్రంట్, బ్యాక్ మరియు సైడ్ యాంగిల్స్‌లో స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఆమె ఎంతో అందంగా కనిపించడంతో ప్రస్తుతం కామాక్షి భాస్కర్లకు సంబంధించిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






