Kalyani Priyadarshan: లోక ట్రైలర్ రిలీజ్.. పవర్ ఫుల్ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్న కళ్యాణి ప్రియదర్శన్

by Chukka Sudharani |

మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్.. ప్రస్తుతం ‘లోక: చాప్టర్ 1 చంద్ర’ అనే చిత్రంలో నటిస్తుంది.

Kalyani Priyadarshan: లోక ట్రైలర్ రిలీజ్.. పవర్ ఫుల్ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్న కళ్యాణి ప్రియదర్శన్
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్.. ప్రస్తుతం ‘లోక: చాప్టర్ 1 చంద్ర’ అనే చిత్రంలో నటిస్తుంది. కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరోగా కనిపించనున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరోయిన్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించగా.. యాక్షన్ సీన్స్, ఫైట్స్‌తో ఆకట్టుకుంది. ఇక దుల్కర్ సల్మాన్ ప్రజెన్స్‌లో డైరెక్టర్ డొమినిక్ అర్జున్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘కొత్త లోక: చాప్టర్ 1’ పేరుతో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై నాగవంశీ రిలీజ్ చేస్తున్నాడు. ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెస్ కీలకపాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఓ హీరోయిన్ సూపర్ హీరో పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లింక్

Next Story