- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kalyani Priyadarshan: సూపర్ హీరోగా యంగ్ హీరోయిన్.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమా
‘హలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్..

దిశ, సినిమా: ‘హలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్.. ప్రస్తుతం ‘కొత్తలోక: చాప్టర్ 1 చంద్ర’ అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరోగా కనిపించనుండగా.. దీనికి డొమినిక్ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెస్ మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. సూపర్ హీరో ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ మూవీని దుల్కర్ సల్మాన్ నర్మిస్తున్నాడు. తెలుగులో ఈ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత నాగవంశీ రిలీజ్ చేయనుండగా.. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుపుతూ.. ‘వారు మన మధ్య నివసిస్తున్నారు.. ఇప్పుడు ప్రపంచం వారి గురించి తెలుసుకుంటుంది’ అనే క్యాప్షన్ జత చేసి ఓ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో ముగ్గురు అబ్బాయిలు సోఫాపై కూర్చిని వీడియో గేమ్ ఆడుతూ చిల్ అవుతుండగా.. వెనుక నుంచి సూపర్ హీరో (కళ్యాణి ప్రియదర్శన్) వెళ్లడం కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది. లింక్






