రణ్‌వీర్ సరసన సౌత్ హీరోయిన్.. బాలీవుడ్ డెబ్యూ అదిరిపోతుంది.. +6532

by Sujitha Rachapalli |

బ్యూటిపుల్ కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా ‘లోకా : చాప్లర్ 1 -చంద్ర’తో భారీ సక్సెస్ అందుకుంది. ఇంటెన్స్ యాక్షన్ లుక్స్‌తో అదరగొట్టింది.

రణ్‌వీర్ సరసన సౌత్ హీరోయిన్.. బాలీవుడ్ డెబ్యూ అదిరిపోతుంది.. +6532
X

దిశ, సినిమా : బ్యూటిపుల్ కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా ‘లోకా : చాప్లర్ 1 -చంద్ర’తో భారీ సక్సెస్ అందుకుంది. ఇంటెన్స్ యాక్షన్ లుక్స్‌తో అదరగొట్టింది. ఫీమెల్ సెంట్రిక్‌గా వచ్చిన ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లు వసూల్ చేసింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కాగా ఈ టాలెంటెడ్ బ్యూటీ బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ‘ధురంధర్’ తర్వాత రణ్‌వీర్ సింగ్ చేస్తున్న జాంబీ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రళయ్’లో లీడింగ్ లేడీగా కనిపించబోతుంది. ఈ చిత్రానికి జై మెహతా దర్శకుడు కాగా ఇది ఆయన ఫీచర్ డైరెక్టోరియల్ డెబ్యూగా మారనుంది. పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ సర్వైవల్ స్టోరీ, భారీ VFX, వరల్డ్ బిల్డింగ్‌తో ఎమోషనల్‌ డెప్త్‌తో ఉండబోతుంది. World War Z లేదా I Am Legend లాంటి టోన్‌లో ఈ సినిమా ఉంటుందని బాలీవుడ్ టాక్. కాగా ఈ సినిమాను రణ్‌వీర్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం. ‘మా కసమ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై.. హన్సల్ మెహతా ట్రూ స్టోరీ ఫిల్మ్స్, సమీర్ నాయర్ అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడని.. షూటింగ్ ఏప్రిల్ 2026 నుంచి స్టార్ట్ అవుతుందని టాక్.

Next Story