Kalyan Ram: ‘ఆ సీనియర్ స్టార్ హీరోయిన్ ఒప్పుకోవడం వల్లనే సినిమా చేయగలిగాం’.. కల్యాణ్ రామ్ కామెంట్స్ వైరల్

by Kodari Anjali |

ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun sannaph vaijayantihi). ఈ మూవీలో నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram) కథానాయకుడిగా నటిస్తున్నారు.

Kalyan Ram: ‘ఆ సీనియర్ స్టార్ హీరోయిన్ ఒప్పుకోవడం వల్లనే సినిమా చేయగలిగాం’.. కల్యాణ్ రామ్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun sannaph vaijayantihi). ఈ మూవీలో నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram) కథానాయకుడిగా నటిస్తున్నారు. నిన్న (మార్చి 1) ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. దీంతో ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ సాంగ్‌ను రఘు రామ్ (Raghu Ram) లిరిక్స్ అందించారు. నకాష్ అజీజ్ (Nakash Aziz), సోనీ కొమండూరి ఆలపించగా.. అజనీష్ లోక్ నాథ్ (Ajanish Loknath) సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో సీనియర్ ప్రముఖ హీరోయిన్ విజయశాంతి (Vijayashanti) ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే అశోక క్రియేషన్స్ (Ashoka Creations).. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైజయంతి పాత్రలో విజయశాంతి నటించగా.. అర్జున్ రోల్‌లో కల్యాణ్ రామ్ కనిపించనున్నారు.

అయితే ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ప్రేక్షకులందికీ గుర్తుండిపోయేలా నిలుస్తుందని అన్నారు. అలాగే విజయశాంతి ఒప్పుకోవడం వల్లనే ఈ చిత్రాన్ని చేయగలుగుతున్నామని చెప్పుకొచ్చారు. అమ్మల్ని గౌరవించాలని.. వారి కోసం ఎన్ని త్యాగాలు చేసినా తక్కువేనని వెల్లడించారు. ఇక కల్యాణ్ రామ్ ఇందులో పల్నాటి పౌరుషం మొత్తం ఆయనలో కనిపించే రోల్‌లో చూడబోతున్నామంటూ టాక్ వినిపిస్తుంది. ఈ ఈవెంట్‌లో చదలవాడ ఆదిత్య బాబు (Chadalawada Aditya Babu), అశోక్ వర్ధన్ ముప్పా (Ashok Vardhan Muppa) పలువురు పాల్గొన్నారు.

Next Story