Kalki: త్వరలోనే కల్కి సీక్వెల్‌పై అప్‌డేట్స్.. గుడ్ న్యూస్ ప్రకటించిన మూవీ టీమ్

by Chukka Sudharani |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘కల్కి 2898AD’.

Kalki: త్వరలోనే కల్కి సీక్వెల్‌పై అప్‌డేట్స్.. గుడ్ న్యూస్ ప్రకటించిన మూవీ టీమ్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘కల్కి 2898AD’. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. గతేడాది సమ్మర్ స్పెషల్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే.. ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ.. సీక్వెల్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్కి నిర్మాణ పనుల చూసుకుంటున్న స్వప్న దత్, ప్రియాంక దత్‌లు ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘‘కల్కి’ పార్ట్ 1తో పాటే సీక్వెల్‌కు సంబంధించిన కొంచెం షూటింగ్ కూడా పూర్తి చేశాము. పార్ట్ 2 కు సంబంధించిన 35 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.. ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ త్వరలో వస్తాయి’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీరి కామెంట్స్ వైరల్ అవుతుండగా.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story