‘కలం కవల్’ మూవీ అప్డేట్ విడుదల.. మెగాస్టార్ షాకింగ్ లుక్ వైరల్.. డైరెక్టర్ ఎవరంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-02-16 14:15:55  IST  )

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు.

‘కలం కవల్’ మూవీ అప్డేట్ విడుదల.. మెగాస్టార్ షాకింగ్ లుక్ వైరల్.. డైరెక్టర్ ఎవరంటే?
X

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. 73 ఏళ్లు వచ్చినప్పటికీ విరామం తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. గత ఏడాది ఆయన టర్బో, బ్రహ్మ యుగం, యాత్ర-2, అబ్రహం ఒజ్లెలర్ వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’(Dominic and the Ladies Purse ) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం మమ్ముట్టి ‘బజూకా’(Bazooka) సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, మమ్ముట్టి ఓ కొత్త మూవీని ప్రకటించారు. జితిన్ కె జోసే(Jitin K Jose) దర్శకత్వంలో వస్తున్న ‘కలం కవల్’ (kalamkaval) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా స్వయంగా ఆయనే దీనిని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను మమ్ముట్టి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అయితే ఇందులో ఆయన సిగరెట్‌ను పల్ల మధ్యలో పెట్టుకుని నముతున్నట్లు కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Next Story