trailer: ప్రతీ సీన్‌కు వెన్నులో వణుకే.. భయంకరంగా ‘మా’ ట్రైలర్

by Chukka Sudharani |   (  Updated:2025-08-02 08:39:06  IST  )

స్టార్ హీరోయిన్ కాజోల్ (Kajol) నటిస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ (Horror thriller) మూవీ ‘మా’ (Maa).

trailer: ప్రతీ సీన్‌కు వెన్నులో వణుకే.. భయంకరంగా ‘మా’ ట్రైలర్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కాజోల్ (Kajol) నటిస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ (Horror thriller) మూవీ ‘మా’ (Maa). విశాల్ ఫ్యూరియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని జియో స్టూడియోస్, దేవ్‌గన్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై అజయ్ దేవ్‌గన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్ దగ్గర నుంచి, ఫస్ట్ లుక్ పోస్టర్స్ వరకు అన్నీ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఇక తాజాగా ‘మా’ మూవీ ట్రైలర్‌(Trailer)ను రిలీజ్ చేసి మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశారు చిత్ర బృందం.

ఈ సినిమా ట్రైలర్‌ను గమనించినట్లయితే.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చే ప్రతీ హారర్ సీన్ ఆడియన్స్‌కు వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. దెయ్యం బారిన పడిన తన కూతురును కాపాడేందుకు తల్లి చేసిన యుద్ధమే ‘మా’ కథగా అర్థం అవుతుండగా.. కాజోల్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. కాగా.. రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, ఖేరిన్ శర్మ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య జూన్ 27న హిందీ, తమిళ, తెలుగు, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.

Next Story