Maa: ఓటీటీలోకి కాజోల్ హారర్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Chukka Sudharani |

బాలీవుడ్ నటి కాజోల్ (Kajol) రీసెంట్‌గా ‘మా’ (Maa) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Maa: ఓటీటీలోకి కాజోల్ హారర్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కాజోల్ (Kajol) రీసెంట్‌గా ‘మా’ (Maa) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హారర్ థ్రిల్లర్ (Horror thriller) బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు విశాల్ ఫ్యూరియా దర్శకత్వం వహించాడు. అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించగా.. రోనిత్ బోస్ రాయ్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, ఖేరిన్ శర్మ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. ఇది ముఖ్యంగా తల్లిబిడ్డల మధ్య జరిగే కథ. కాజోల్ భర్తను ఓ రాక్షసుడు చంపగా.. కాజోల్ తన పూర్వీకుల భవనాన్ని అమ్మడానికి చందర్‌పూర్ అనే నగరానికి వెళ్తుంది. అక్కడ ఆమె బిడ్డను రాక్షసులు టార్గెట్ చెయ్యగా వారి భారీ నుంచి.. ఓ అమ్మ తన బిడ్డను ఎలా రక్షించుకుంటుంది అనేది కథ.

జూన్ 27న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజైన ఈ చిత్రం.. హారర్ అండ్ సస్పెన్స్ సీన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ (OTT) రిలీజ్‌కు సిద్ధం అయింది. ‘మా’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకోగా.. ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే.. ఏయే భాషల్లో అందుబాటులో ఉండనుంది అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story