- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kajol: నైసా దేవగన్ సినీ ఎంట్రీ రూమర్స్ పై కాజోల్ స్పందన
సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు తమ వారసుల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తారు.

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు తమ వారసుల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తారు. టాలీవుడ్ అయినా, బాలీవుడ్‌లో అయినా పలువురి హీరో, హీరోయిన్ల కుమార్తెలు, కుమారులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ జంట అయిన అజయ్ దేవగణ్ (Ajay Devgan) అండ్ కాజోల్ (Kajol) కుమార్తె నైసా దేవగన్ (Nysa Devgan) సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా ఈ పుకార్లపై తల్లి కాజోల్ స్పందించింది. తాజాగా జరిగిన రైజింగ్ భారత్ సమ్మిట్‌లో దీనిపై ప్రశ్నించగా.. పుకార్లకు చెక్ పెట్టింది. నైసా దేవగన్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ చేసే అవకాశం లేదని తేల్చి చెప్పింది. ఆమె నటి కావడానికి ఆసక్తి చూపడం లేదని కాజోల్ స్పష్టం చేసింది. నైసా ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఉన్న గ్లియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతోందని వెల్లడించింది.
అస్సలు నైసాకు నటి కావాలనే కోరిక లేదని, ఆమెకు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఆలోచన లేదని జనాలకు క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం కాజోల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నటి కాజోల్ చివరగా దో పట్టి అనే ఓటీటీ సిరీస్‌లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సిరీస్‌లో కాజల్ తొలిసారిగా ఒక లాంగర్ క్యారెక్టర్, పోలీసు పాత్రను పోషించింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయి మంచి రెస్పాన్స్ అందుకుంది.






