Ramoji Film City: రామోజీ ఫిల్మ్ సిటీపై షాకింగ్ కామెంట్స్ చేసిన కాజోల్.. మరోసారి దాని గురించి ప్రస్తావిస్తూ ట్వీట్

by Chukka Sudharani |

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ నటిస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘మా’.

Ramoji Film City: రామోజీ ఫిల్మ్ సిటీపై షాకింగ్ కామెంట్స్ చేసిన కాజోల్.. మరోసారి దాని గురించి ప్రస్తావిస్తూ ట్వీట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ నటిస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘మా’. ఈ సినిమాకు విశాల్ ఫ్యూరియా దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తున్న ఈ సినిమాలో రోనిత్ బోస్ రాయ్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, ఖేరిన్ శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 20న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొన్న కాజోల్.. హైదరాబాద్‌లో ఉండే రామోజీ ఫిల్మ్ సిటీపై గతంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నప్పుడు నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, మరోసారి అక్కడికి రాకూడదు అనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటు అది’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ కావడంతో సంచలనంగా మారింది.

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ప్రస్తావిస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ వేదిగా ఓ పోస్ట్ పెట్టింది కాజోల్. ఈ మేరకు ‘నా సినిమా ‘MAA’ ప్రమోషన్స్ సందర్భంలో రామోజీ ఫిల్మ్ సిటీ గురించి నేను ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తుచేయాలనుకుంటున్నాను. నేను రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించిన షూటింగ్ చేశాను. చాలా సార్లు అక్కడ బస చేశాను. సినిమా నిర్మాణానికి ఇది చాలా ప్రొఫెషనల్ ప్లేస్ అని నేను చెప్పాలి అనుకున్నా. అంతే కాకుండా.. అక్కడకు వచ్చి చాలా మంది పర్యాటకులు ఆనందించడం నేను చూశాను. ఇది గొప్ప గమ్యస్థానం అండ్ కుటుంబాలు, పిల్లలకు కూడా ఇది పూర్తిగా సురక్షితం. ఎంజాయ్ కూడా చేస్తారు’ అని తెలిపింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
Tweet

Next Story