- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kajol: నా కూతురు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలనుకోవడం లేదు.. కాజోల్ కామెంట్స్‌తో నిరుహ్సంలో ఫ్యాన్స్
బాలీవుడ్ స్టార్ నటి కాజోల్.. ప్రజెంట్ వరుస ప్రాజెక్టులతో సందడి చేస్తుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి కాజోల్.. ప్రజెంట్ వరుస ప్రాజెక్టులతో సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తన గారాలపట్టి కుమార్తె నైసా దేవగన్ ఇండస్ట్రీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. నిజానికి నైసా దేవగన్‌కు ప్రస్తుతం 22ఏళ్లు వయస్సు కాగా.. హీరోయిన్ మెటీరియల్ అంటూ త్వరలోనే ఆమె కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
తాజాగా వీటిపై స్పందించిన కాజల్.. ‘నైసా నటనలోకి రావడం లేదు. ఆమెకు ప్రస్తుతం 22 ఏళ్లు.. అలాగే పరిశ్రమలోకి రావలానే ఉద్దశం తనకు లేదు’ అని తెలిపింది. దీంతో కాజోల్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక స్టార్ కిడ్స్ ఎదుర్కొంటోన్న చాలెంజెస్ గురించి మాట్లాడుతూ.. ‘వాళ్లు సినిమా ప్రపంచంలోకి రావడానికి మాత్రమే మా ప్రమోయం ఉంటుంది. ఒకసారి వచ్చిన తర్వాత పాజిటివ్లు, నెగిటివ్లు భరించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇవన్ని కఠినంగా అనిపించిన.. అది వాళ్ల గ్రోత్‌కు ఉపయోగపడతాయి. అలాగే సక్సెస్ అనేది కూడా వాళ్లు నటన, కథలపై ఆధారపడి ఉంటుంది’ అంటూ తెలిపింది.






