Kajol : వివాదంలో చిక్కుకున్న కాజోల్.. మరోసారి క్లారిటీ ఇస్తూ కామెంట్స్

by Chukka Sudharani |

ఇటీవల సెలబ్రిటీ టాక్ షోలో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ కాజోల్ నటీనటుల పనితీరును.. కార్పొరేట్ ఉద్యోగస్థులతో పోల్చగా ప్రస్తుతం అవి చర్చుకు దారి తీశాయి.

Kajol : వివాదంలో చిక్కుకున్న కాజోల్.. మరోసారి క్లారిటీ ఇస్తూ కామెంట్స్
X

దిశ, సినిమా: ఇటీవల సెలబ్రిటీ టాక్ షోలో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ కాజోల్ నటీనటుల పనితీరును.. కార్పొరేట్ ఉద్యోగస్థులతో పోల్చగా ప్రస్తుతం అవి చర్చుకు దారి తీశాయి. ఈ క్రమంలోనే మరోసారి వీటిపై క్లారిటీ ఇచ్చింది కాజోల్. ‘ఉద్యోగాలు వేరు.. నటన వేరు. ఎందుకంటే షూటింగ్ సమయంలో నటీనటులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి.. మేము ది ట్రయిల్ రెండో సీజన్ కోసం ఒక ప్రాంతానికి వెళ్లాం. 40 రోజులు బ్రేక్ లేకుండా షూటింగ్‌లో పాల్గొన్నాము. ఆ రోజుల్లో మేం ఎప్పుడూ అందుబాటులో ఉండేవాళ్లం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, అలాగే సరిగ్గా మేంటేన్ చేస్తూ ఎప్పుడూ ఒకే లుక్‌లో కనిపించాలి. అలా ఉండడం చాలా ఒత్తిడిగా ఉంటుంది.. ఇది మిగతా ఉద్యోగులకు ఉండదు. ఆ ఉద్దేశంతోనే నేను పోలిక చెప్పాను.. తప్పుగా అర్థం చేసుకోకండి’ అంటూ తెలిపింది కాజోల్.

Next Story