కాజల్ ది ఇండియా స్టోరీ ఫస్ట్ లుక్ రిలీజ్.. క్యూరియాసిటీని పెంచేస్తున్న పోస్టర్

by Chukka Sudharani |

కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే కలయికలో రాబోతున్న సినిమా ‘ది ఇండియా స్టోరీ’.

కాజల్ ది ఇండియా స్టోరీ ఫస్ట్ లుక్ రిలీజ్.. క్యూరియాసిటీని పెంచేస్తున్న పోస్టర్
X

దిశ, సినిమా: కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే కలయికలో రాబోతున్న సినిమా ‘ది ఇండియా స్టోరీ’. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సహకారంతో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన తొలి అధికారిక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో ఆసక్తిని పెంచిన చిత్రబృందం.. తాజాగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌తో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. ఈ పోస్టర్‌లో కాజల్ అగర్వాల్ ఓ న్యాయవాదిగా, శ్రేయస్ తల్పడే ఆందోళనలో ఉన్న తండ్రిగా చేతిలో బిడ్డతో కనిపిస్తున్నారు. అలాగే శ్రేయస్ కుమార్తె పాత్రలో కనిపిస్తున్న చిన్నారి ద్వారా, లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేస్తున్న ఒక తీవ్రమైన సమస్య వెనుక ఉన్న మానవీయ కోణాన్ని పోస్టర్ బలంగా ఆవిష్కరించింది. ముంబై హైకోర్టు నేపథ్యంతో రూపొందించిన ఈ పోస్టర్‌లో, సాక్షుల బోనులో ఉంచిన పురుగుమందు సిలిండర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి చెట్టన్ డీకే దర్శకత్వం వహించగా, సాగర్ బి. షిండే కథ, స్క్రీన్‌ప్లే అందించి నిర్మిస్తున్నారు. జూలై 24, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇక భారతదేశంలో ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యంత కీలకమైన, తరచూ నిర్లక్ష్యానికి గురయ్యే ఆహార కల్తీ సమస్య ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది.

Next Story