- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాజల్ అగర్వాల్ ‘ది ఇండియన్ స్టోరీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఎట్టకేలకు కాజల్ అగర్వాల్ నటించిన ‘ది ఇండియా స్టోరీ’సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్.. పెళ్లి, పిల్లలు తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. ఇప్పుడు ఈ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. డీకే చేతన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఎమ్ఐజీ ప్రొడక్షన్స్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బి.షిండే నిర్మిస్తున్నారు. ఇందులో కాజల్ లాయర్ పాత్రలో కనిపించబోతుంది. ఒకప్పుడు దేశాన్ని కుదిపేసిన నిజమైన పురుగు మందు కుంభకోణాల ఆధారంగా రాబోతున్న ఈ ఉత్కంఠభరితమైన డ్రామా.. గతేడాదే థియేటర్స్‌లోకి రావాల్సి ఉండగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధం అయింది. జూలై 24న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నట్లు ప్రకటించారు. కాగా.. కెమికల్స్ దుర్వినియోగం, సాగులో పురుగుమందుల మితిమీరిన వినియోగం, దీని వెనుక ఉన్న భారీ కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుంది.






