- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ క్యాలెండర్‌లో డేట్ మార్క్ చేసుకోండి..
డిఫరెంట్ జోనర్స్ కథలు ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘EPIC’ (ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్).

దిశ, సినిమా: డిఫరెంట్ జోనర్స్ కథలు ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘EPIC’ (ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్). ‘90s’ వెబ్ సిరీస్‌తో అందరి మనసులు దోచుకున్న డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ‘సంచారమే’ సాంగ్‌కు నెట్టింట సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు.. ఆనంద్, వైష్ణవి చైతన్య క్యూట్ లుక్ షేర్ చేస్తూ.. ‘అత్యంత సాధారణ క్షణాలలోనే.. అత్యంత అందమైన ప్రేమ నివసిస్తుంది.. ఏప్రిల్ 29న EPIC టీజర్ రాబోతున్నది.. మీ క్యాలెండర్‌లో డేట్ మార్క్ చేసుకోండి’ అని చెప్పుకొచ్చారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది






