ఊహించని డ్రెస్‌లో దర్శనమిచ్చిన అగ్ర తార చెల్లెలు.. స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వనుందా..?

by Kodari Anjali |   (  Updated:2025-07-02 05:40:58  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సిస్టర్ నిషా అగర్వాల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

ఊహించని డ్రెస్‌లో దర్శనమిచ్చిన అగ్ర తార చెల్లెలు.. స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వనుందా..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సిస్టర్ నిషా అగర్వాల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నిషా అగర్వాల్ తర్వాత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం తెలుగు చిత్రాల్లోనే కాకుండా.. మలయాళం అండ్ తమిళ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.

నిషా అగర్వాల్ మొదటి చిత్రం రొమాంటిక్ డ్రామా.. ఏమైంది ఈవేళలో అవంతిక పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.ఆమె నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందాయి. ఇక తదుపరి చిత్రం సోలో ఇది 2011 చివరలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇందులో నిషా మెడికల్ కాలేజీ విద్యార్థిగా కనిపించి మెప్పించింది.

వీటితో పాటు ఈ హీరోయిన్ ఇష్టం, సుకుమారుడు, సరదాగా అమ్మాయితో, భయ్యా భయ్యా, దాయాదులు వంటి సినిమాల్లో నటించింది. తర్వాత నిషా అగర్వాల్ డిసెంబర్ 28, 2013న ముంబైకి చెందిన వ్యాపారవేత్త కరణ్ వలేచాను వివాహం చేసుకుంది. ఇకపోతే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. కాస్త బోల్డ్‌గా, స్టైలిష్ డ్రెస్ ధరించి ఫొటోలు పంచుకోవడంతో.. నెటిజన్లు మళ్లీ రీఎంట్రీ ఇచ్చి, ప్రముఖ హీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వనుందా? అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story