- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kajal Aggarwal: కొత్త సినిమా ఫస్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన కాజల్ అగర్వాల్.. పిక్ వైరల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తన సత్తా చాటుకుంటూ వరుస సినిమాల్లో నటిస్తుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తన సత్తా చాటుకుంటూ వరుస సినిమాల్లో నటిస్తుంది. ఈ క్రమంలోనే గతేడాది ‘ఇండియన్-2’ (Indian-2), ‘సత్యభామ’ (Satya Bhama) వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్.. ప్రజెంట్ రెండు మూడు చిత్రాలతో సందడి చేస్తుంది. అందులో మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ (Kannappa) ఒకటి. ఈ మూవీలో కాజల్ పార్వతి దేవి (Parvati Devi) గా నటిస్తుండగా.. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ (First look) పోస్టర్ కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం. అందులో కాజల్ వైట్ కలర్ శారీలో ధ్యానం చేస్తు్న్నట్లు కనిపించి ఆడియన్స్ (Audience)ను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు మరో మూవీ అప్‌డేట్ ఇచ్చింది. ఈ మేరకు కాజల్ తన సోషల్ మీడియా (Social media) అకౌంట్ X ద్వారా.. ‘‘ది ఇండియా స్టోరీ’ (The India Story) కోసం పూణేలో మా మొదటి షెడ్యూల్‌ని ప్రారంభిస్తున్నాం. ఈ ప్రభావవంతమైన కథలో నటిస్తు్న్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ క్యాలెండర్‌లో మార్క్ చేసుకోండి.. 15/8/25 - థియేటర్లలో కలుద్దాం!’ అంటూ క్లాప్ కొడుతున్న పిక్ షేర్ చేసింది.






