kajal: కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు రంగంలోకి దిగనున్న సీనియర్ నటి.. చెమటలు పుట్టిస్తోన్న లేటెస్ట్ లుక్

by Kodari Anjali |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

kajal: కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు రంగంలోకి దిగనున్న సీనియర్ నటి.. చెమటలు పుట్టిస్తోన్న లేటెస్ట్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'లక్ష్మీ కళ్యాణం'(Lakshmi Kalyanam) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బిజినెస్ మ్యాన్ అయినటువంటి గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే ఓ బాబుకు జన్మ కూడా నిచ్చింది. దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ 'సత్యభామ' (Satyabhama) మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. 'సికిందర్'(Sikinder), కన్నప్ప సినిమాలతో మన ముందుకు వచ్చింది. బాలీవుడ్‌లో కూడా నటించి ఈ అమ్మడు ప్రేక్షకుల్ని అలరించింది.

ఈ నటి సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ.. నిత్యం సోషల్ మీడియా (Social Media) మాత్రం యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ బ్యూటీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. కుర్ర లుక్‌ను తలపించేలా అదిరిపోయే ఫొటో షూట్ చేసింది. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు రంగంలోకి దిగనుందా? చెమటలు పుట్టిస్తుందిగా అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.

instagram link

Next Story