Dulquer Salmaan: ‘కాంత’ అప్డేట్ ఇచ్చిన దుల్కర్.. మీరే నాకు స్ఫూర్తి అంటూ స్టార్ నటుడి పవర్ లుక్ విడుదల చేయడంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-26 12:16:00  IST  )

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం’ సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నారు.

Dulquer Salmaan: ‘కాంత’ అప్డేట్  ఇచ్చిన దుల్కర్.. మీరే నాకు స్ఫూర్తి అంటూ స్టార్ నటుడి పవర్ లుక్ విడుదల చేయడంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం’ సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం దుల్కర్, సెల్వమణి సెల్వరాజ్(Selvamani Selvaraj) కాంబినేషన్‌లో ‘కాంత’ (Kaantha)చిత్రం రాబోతుంది. అయితే ఈ మూవీని 1950 మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠమరితమైన నాటకీయ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్, వేఫారేర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రానా దగ్గుబాటి(Rana Daggubati), దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse)హీరోయిన్‌గా నటిస్తోంది.

షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఇక ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్లు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, ఈ సినిమాలో మరో స్టార్ నటుడు నటిస్తున్నట్లు దుల్కర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తమిళ్‌, తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా.. దర్శకుడిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సముద్రఖని ‘కాంత’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్‌ను షేర్ చేశారు. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో అభిమానులను ట్రీట్ ఇచ్చారు. ఇక ఇందులో కళ్లజోడు ధరించి, గళ్ల చొక్కాలో ఇంటెన్నివ్ లుక్‌లో కనిపించాడు.

అయితే ఇందులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఈ పోస్ట్‌కు దుల్కర్ ‘‘సదా స్ఫూర్తిదాయకమైన సముద్రఖనికి అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు! కాంతలో అతని పవర్ ఫుల్ లుక్ మొదటి సంగ్రహావలోకనం ఇక్కడ ఉంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు ప్లీజ్ దయచేసి టీజర్ రిలీజ్ చేయండి సార్ మేము చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

Next Story