- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KS Ravikumar : చిరంజీవి డెడికేషన్ వల్లే ఆ మూవీని అంత త్వరగా పూర్తి చేశాం
కె.ఎస్. రవికుమార్ మాట్లాడుతూ... స్నేహం కోసం చిత్రాన్ని 43 రోజుల్లో పూర్తి చేశాం. చిరంజీవి గారు ఆ సినిమా కోసం ఎంతో శ్రద్ధగా పనిచేశారు. అందుకే ఆ సినిమా త్వరగా పూర్తయిందని ఈయన చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: చాలా సంవత్సరాల పాటు తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగించిన వారిలో కె.ఎస్. రవికుమార్ ఒకరు. ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ జోష్‌లో కెరీర్ను సాగిస్తున్న సమయంలోనే తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశాడు. ఈయన టాలీవుడ్లో చేసిన చిత్రాల్లో కొన్ని మంచి విజయాలు సాధించడంతో ఈ దర్శకుడికి తెలుగు సినిమా పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఈ డైరెక్టర్ కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి హీరోగా రూపొందిన 'స్నేహం కోసం' అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.
ఈ మూవీ మంచి విజయం సాధించింది. తాజాగా కె.ఎస్. రవికుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో 'స్నేహం కోసం' మూవీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ దర్శకుడు మాట్లాడుతూ... 'స్నేహం కోసం' మూవీ కథను చిరంజీవి గారికి చెప్పినప్పుడు అది ఆయనకు నచ్చింది. వెంటనే సినిమా చేయడానికి రెడీ అయ్యారు. సినిమా పట్ల ఆయనకు ఎంతో బాధ్యత ఉంటుంది. అలాగే ఆయన ఎంతో అంకితభావంతో వ్యవహరిస్తూ ఉంటారు. మేము 'స్నేహం కోసం' సినిమాను కేవలం 43 రోజుల్లో పూర్తి చేశాం.
అంత స్పీడుగా ఆ సినిమాను పూర్తి చేయడానికి ప్రధాన కారణం చిరంజీవి. ఆయన ఎంతో శ్రద్ధతో ఈ సినిమా గురించి పనిచేశాడు. అందుకే ఆ మూవీని మేము చాలా త్వరగా పూర్తి చేయగలిగాము అని కె.ఎస్. రవికుమార్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా మీనా నటించింది. ఎస్.ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ సూర్యా మూవీస్ పతాకంపై ఎ.ఎం. రత్నం నిర్మించారు. 1999లో విడుదల అయిన ఈ చిత్రంలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేసి రెండు పాత్రల్లోనూ తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.






