- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jyoti Purvaj: ఈ సినిమాతోనే డైరెక్టర్ నా పార్టనర్ అయ్యాడు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్
తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో సూపర్ హీరో మూవీ సిద్ధమవుతోంది.

దిశ, సినిమా: తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో సూపర్ హీరో మూవీ సిద్ధమవుతోంది. ‘ఇట్స్ మై లవ్‌స్టోరీ’ ఫేమ్ అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ‘ఏ మాస్టర్ పీస్’ అనే టైటిల్‌తో దర్శకుడు సుకు పూర్వజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడ, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని వచ్చిన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో ముచ్చటంచారు మూవీ టీమ్.
ఇందులో భాగంగా.. హీరోయిన్ జ్యోతి పూర్వాజ్ మాట్లాడుతూ ‘నేను రెండేళ్ల కిందట ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ఆ తర్వాత ఈ సినిమా వల్ల పూర్వాజ్ నా లైఫ్ పార్టనర్‌గా మారాడు. ‘ఏ మాస్టర్ పీస్’ సూపర్బ్ స్క్రిప్ట్‌తో వస్తోంది. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ డిఫరెంట్ వేరియేషన్స్‌లో ఉంటుంది. ప్రేక్షకులు ఒక్కోసారి ఆశ్చర్యపోతారు. నా కెరీర్‌లో నటిగా సంతృప్తినిచ్చిన క్యారెక్టర్ ఇది. మైథాలజీని, సూపర్ హీరో జానర్‌ను కలిపి ఒక గొప్ప చిత్రాన్ని డైరెక్టర్ పూర్వాజ్ రూపొందిస్తున్నారు. నేను పేర్లు చెప్పను గానీ తెలుగులో వచ్చిన కొన్ని గొప్ప చిత్రాల సరసన ‘ఏ మాస్టర్ పీస్’ చేరుతుంది. సూపర్ హీరోను మనం ఎలా ఊహించుకుంటామో అలా అరవింద్ కృష్ణ కనిపిస్తారు. అరవింద్ కృష్ణతో నేను గతంలో ఓ చిత్రంలో నటించాను. మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్. భారీ మేకింగ్‌తో ‘ఏ మాస్టర్ పీస్’ రూపొందిస్తున్నాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’ అని తెలిపింది.
Read Also..
మేము సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరందరూ అడుగు పెట్టే వరకు నేను వేచి ఉండలేను: రాశి ఖన్నా






