- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కిల్లర్’ గ్లింప్స్ రాబోతుందంటూ పోస్ట్.. క్లీవేజ్ షోతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతి
‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ జ్యోతి పూర్వాజ్ (Jyothi Purvaj) హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘కిల్లర్’ (killer).

దిశ, సినిమా: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ జ్యోతి పూర్వాజ్ (Jyothi Purvaj) హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘కిల్లర్’ (killer). ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ వంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ పూర్వాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్నాడు. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో విశాల్ రాజ్ (Vishal Raj), గౌతమ్ (Gautham) కూడా హీరోలుగా యాక్ట్ చేస్తున్నారు. ఏయు అండ్ఐ, మెర్జ్‌ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి. ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుండగా.. ఈ మధ్య కాలంలో ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
ఈ క్రమంలోనే తాజాగా ‘కిల్లర్’ గ్లింప్స్ రాబోతున్నట్లు తెలిపారు. ‘ఆమె మేల్కొని ఉంది.. ఆమె అన్నీ చూస్తోంది.. ఇదిగో మీ భవిష్యత్తు.. ఏప్రిల్ 30న కిల్లర్ మొదటి గ్లింప్స్ రాబోతుంది’ అనే క్యాప్షన్ ఇచ్చి జ్యోతి పూర్వజ్ ఫొటోలను షేర్ చేశారు చిత్ర బృందం. ఇందులో జ్యోతి స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ క్లీవేజ్ షోతో ఆకట్టుకుంటోంది. కాగా.. లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందుతున్న ‘కిల్లర్’ చిత్రం సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు మెమొరబుల్ ఎక్సిపీరియన్స్ ఇవ్వనుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మూవీ యూనిట్.






