- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ వీడియో షేర్ చేసిన జూనియర్ సమంత.. బెస్ట్ కమ్ బ్యాక్ అంటూ నెటిజన్ల కామెంట్స్
జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషురెడ్డి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషురెడ్డి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో ఈ చిన్నది బుల్లితెరపై పలు రకాల షోలతో ఫేమస్ అవుతున్న టైమ్‌లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి రాత్రికి రాత్రే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వర్మ నేలపై కూర్చొని అషురెడ్డి పాదాలకు ముద్దు పెట్టిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో రాత్రికి రాత్రే బిగ్ సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి అక్కడ మరింత పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ చిన్నది చాలా సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు, షోస్‌లతో బిజీబిజీగా ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ గతంలో బ్రెయిన్‌కి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ టైమ్‌లో ఆమె ఎంత స్ట్రగుల్ అయిందో ఓ షోలో చెప్పి ఎమోషనల్ కూడా అయింది. ఈ క్రమంలో తాజాగా ఈ చిన్నదాని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అషురెడ్డి.. తనకు సర్జరీ అయిన టైమ్‌లో తీసుకున్న ఫొటోస్‌ను అండ్ జిమ్‌లో కష్టపడుతున్న పిక్స్‌ను ఓ వీడియోగా చేసి పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోకు.. ‘జీవితం ఉంది. ఆశ ఉంది.. ఎప్పుడూ వదులుకోకు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు బెస్ట్ కమ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






