పండుగ ఫీల్స్ అంటూ ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసిన జూనియర్ సమంత..

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-16 06:38:59  IST  )

జూనియర్ సమంత‌గా పేరు తెచ్చుకున్న నటి అషు రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

పండుగ ఫీల్స్ అంటూ ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసిన జూనియర్ సమంత..
X

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ సమంత‌గా పేరు తెచ్చుకున్న నటి అషు రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అలరించిన ఈ చిన్నది ప్రజెంట్ పలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. అయితే డైరెక్టర్ ఆర్జీవీతో చేసిన ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఈ భామ నైటుకు నైటే ఫేమస్ అయిపోయింది. దీంతో బిగ్ బాస్ సీజన్-3లో కంటెస్టెంట్‌గా చాన్స్ వచ్చింది. అక్కడ ఆ హౌస్‌లో అడుగు పెట్టిన ఈ చిన్నది అక్కడ కూడా నానా హంగామా చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

ఇక బయటికి వచ్చాక ఈ ముద్దుగుమ్మ టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియాలో ఈ అమ్మడి గ్లామర్ డోసు ఎక్కువగానే ఉంటుంది. నెట్టింట హాట్ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంటది. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ చేసింది. అందులో గ్రీన్ అండ్ పింక్ కలర్ లంగా ఓణీలో ట్రెడిషనల్‌గా రెడీ అయి కనిపించింది. జడ అల్లుకుని చాలా అందంగా ముస్తాబచ్చింది.

ఎప్పుడూ బోల్డ్ షో చేసే ఈ చిన్నది ఇలా సంప్రదాయకంగా రెడీ అయి షాక్ ఇచ్చింది. ఇక ఈ పిక్‌కు ‘పండుగ ఫీల్స్.. మోర్ కమింగ్ సూన్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు హ్యాపీ కనుమ అషు గారు చాలా బాగున్నారు అని, బంగారంలా మెరిసిపోతున్నావని కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా జూనియర్ సమంత ట్రెడిషనల్ ఫొటో పై ఓ లుక్ వేసేయండి.

Read More..

లంగా ఓణీలో పవన్ కళ్యాణ్ బ్యూటీ.. ఆ కళ్లేంటి బాబోయ్ అలా ఉన్నాయంటూ కామెంట్స్


Next Story