ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పోరాటం: కాసేపట్లో ‘పర్సనాలిటీ రైట్స్’ కేసు విచారణ!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-27 06:55:52  IST  )

జూనియర్ ఎన్టీఆర్ పర్సనాలిటీ రైట్స్ కేసు నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది.

ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పోరాటం: కాసేపట్లో ‘పర్సనాలిటీ రైట్స్’ కేసు విచారణ!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన పర్సనాలిటీ రైట్స్ (Personality Rights) రక్షణ కోసం రంగంలోకి దిగారు. పర్మీషన్ లేకుండా తన పేరు, ఫోటోలు, గొంతు, వీడియోలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కీలక పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, ప్రైవేట్ సంస్థలు తన అనుమతి లేకుండా తన చిత్రపటాలను, డైలాగులను, పేరును వాణిజ్యపరమైన ప్రకటనలకు వాడుకుంటున్నాయి. దీంతో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా, అభిమానులు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

జస్టిస్ జ్యోతి సింగ్ బెంచ్ విచారణ..

ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం విచారించనుంది. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అనిల్ కపూర్ వంటి దిగ్గజ నటులు కూడా ఇలాంటి హక్కుల కోసం కోర్టును ఆశ్రయించి ‘జాన్ డో’ (John Doe) ఉత్తర్వులను పొందారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా పంథాలో వెళతూ.. తన బ్రాండ్ వాల్యూ‌ను కాపాడుకునేందుకు కోర్టును ఆశ్రయించారు.

Next Story