ఆ మాట నిజంగా నన్ను కదిలించింది.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

by Chukka Sudharani |   (  Updated:2025-03-27 14:09:46  IST  )

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గతేడాది ‘దేవర’(Devara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నాడు.

ఆ మాట నిజంగా నన్ను కదిలించింది.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గతేడాది ‘దేవర’(Devara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. భారీ బడ్జెట్‌తో కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. మార్చి 28న జపాన్‌లో రిలీజ్ కానుంది. దీంతో ప్రజెంట్ అక్కడ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ‘దేవర’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ జపాన్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. అక్కడ అభిమానుల కలిసి ముచ్చటించిన ఎన్టీఆర్.. వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ.. తాజాగా X వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘నా జపాన్ సందర్శనలు నాకు ఎప్పుడూ అందమైన జ్ఞాపకాలను ఇస్తాయి.. కానీ ఒక సందర్శన మాత్రం నాకు ఎప్పటికి గుర్తిండి పోతుంది. ఒక జపనీస్ అభిమాని RRR చూసిన తర్వాత తాను తెలుగు నేర్చుకున్నానని చెప్పాడు. ఆ మాట నిజంగా నన్ను కదిలించింది. ఒక కల్చర్‌కు, ప్రేమకు సినిమా ఈరోజు వారధిగా నిలిచింది. అందుకే ఓ అభిమానిని సినిమా శక్తి భాష నేర్చుకోవడానికి ప్రోత్సహించింది. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం. భారతీయ సినిమా ప్రపంచాన్ని పర్యటించేందుకు ఇది ఒక నిదర్శనం’ అంటూ చెప్పుకొచ్చారు.

Next Story