జూనియర్ NTR హ్యాపీ.. ఎక్స్‌లో పోస్ట్

by Gantepaka Srikanth |

ఇటీవల టాలీవుడ్ దిగ్గజ నటులంతా ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

జూనియర్ NTR హ్యాపీ.. ఎక్స్‌లో పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల టాలీవుడ్ దిగ్గజ నటులంతా ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా పేరు, ఫొటోలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారని, వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు తమ గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నాయని కోర్టుకు విన్నవించారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఎన్టీఆర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇకపై ఎవరూ అనుమతి లేకుండా వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ప్రకటనలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ పెట్టారు.

Next Story