న్యూ లుక్ లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌

by velandi.Saikiran |

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ లాంటి సక్సెస్ ఫుల్‌ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో డ్రాగన్ (Dragon)

న్యూ లుక్ లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాస్, క్లాస్, లవర్ బాయ్ ఇలా అనేక పాత్రల్లో ఒదిగి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు జూనియర్ ఎన్టీఆర్. RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచ స్థాయికి వెళ్ళింది.

అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ లాంటి సక్సెస్ ఫుల్‌ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో డ్రాగన్ (Dragon) అనే సినిమా వస్తోంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫైనల్ కాకపోయినా డ్రాగన్ అని ప్రచారం అయితే సాగుతోంది. అయితే ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ చాలా స్లిమ్ గా మారిపోయారు. వన్డేల్లో నిలదొక్కుకునేందుకు రోహిత్ శర్మ ఎలా కష్టపడుతున్నారో ?, డ్రాగన్ సినిమా కోసం కూడా చాలా కష్టపడ్డారట జూనియర్ ఎన్టీఆర్.

ఇక తాజాగా స‌న్న‌గా మారిన ఎన్టీఆర్ లుక్స్ వైర‌ల్ గా మారాయి. ఈ ఫోటోలు వైర‌ల్ గా మారాయి. ఈ ఫోటోలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. స్పెట్స్‌ పెట్టుకొని సోఫాలో కూర్చున్న ఫోటో చూసి బాగుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సర్కిల్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Next Story