- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యంగ్ టైగర్ బుల్లెట్ బైక్ పై సీనియర్ ఎన్టీఆర్ !
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందుకు ఉంచుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకు వెళ్తున్నాడు. గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పే జూనియర్ ఎన్టీఆర్, RRR సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళాడు. ఆ తర్వాత దేవర సినిమాతో బంపర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్, వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు.
అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో వైరల్ గా మారింది. తన తాత సీనియర్ ఎన్టీఆర్ ను బుల్లెట్ బైక్ పైన జూనియర్ ఎన్టీఆర్ తీసుకు వెళుతున్న వీడియోను వైరల్ చేస్తున్నారు ఆయన అభిమానులు. అలాగే తాత, మనవడు పంట పొలాల్లో తిరుగుతూ, కలిసి భోజనం చేసిన విజువల్స్ కూడా ఈ వీడియోలో పెట్టారు. హరికృష్ణ, సీనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ ముగ్గురు కలిసి సంతోషంగా గడిపిన క్షణాన్ని కూడా పొందుపరిచారు. ఈ వీడియోలో చూస్తుంటే సీనియర్ ఎన్టీఆర్ బతికి ఉన్నాడని అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఈ వీడియోని చిత్రీకరించారు. AI వీడియో అయినప్పటికీ అందరి గుండెల్ని టచ్ చేస్తోంది.
వరుస సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్
దేవర సినిమాతో సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్, ఇటీవల హిందీ సినిమా వార్ 2 తో సందడి చేశారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు ఎన్టీఆర్. ఈ మూవీ తర్వాత దేవర 2 ఉంటుందట. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ మూవీ ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- Tags
- junior ntr
- NTR
- tdp






