- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ లైనప్ లో కొత్త ట్విస్ట్.. ట్రాక్ లోకి దేవర 2
ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ ను చూస్తే.. చాలా సన్నగా కనిపించాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ ను చూస్తే.. చాలా సన్నగా కనిపించాడు. మా అన్నేంటి అలా అయిపోయాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు కూడా పెట్టారు. ఒక సినిమా కోసం ఎన్టీఆర్ చాలా ఎక్కువ వెయిట్ తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పక్కనపెడితే.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పటికే పలు భారీ సినిమాలను లైనప్ ను సెట్ చేసుకున్నారు. దీంతో కొరటాల శివతో చేయాల్సిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ దేవర 2 కోసం అభిమానులు ఎంతో ఎదురుచూశారు. దేవర1 హిట్ కావడం, సినిమా చివరిలో దేవర 2 ఉంటుందని అనౌన్స్ చేయడంతో .. సినిమా వస్తుందన్న ఆశతో ఉన్నారు. కానీ.. సినిమాపై ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకపోవడంతో సినిమా లేదన్న నిర్ణయానికి వదిలేశారు.
కానీ.. తాజాగా ఎన్టీఆర్ సినిమాల్లో సమీకరణాలు మారడంతో దేవర 2 మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొరటాల ప్రిపేర్ చేసిన వెర్షన్ ఎన్టీఆర్ కు నచ్చిందని, త్వరలోనే దేవర ఆగమనం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఇందులో నిజమెంత ఉందన్న విషయం ఇప్పటికైతే స్పష్టత లేదు కానీ.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.






