‘మా బాబాయ్ సింహం.. త్వరలోనే మళ్లీ గర్జిస్తారు’: జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

by Gantepaka Srikanth |

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NBK 111' సినిమా షూటింగ్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు.

‘మా బాబాయ్ సింహం.. త్వరలోనే మళ్లీ గర్జిస్తారు’: జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NBK 111' సినిమా షూటింగ్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో కీలకమైన ఫైట్ సీన్ (యాక్షన్ సీక్వెన్స్) చిత్రీకరిస్తుండగా ఆయన కాలుజారడంతో మోకాలికి స్వల్ప గాయమైంది. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ షూటింగ్‌ను నిలిపివేసి, ఆయనను చికిత్స నిమిత్సం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలకృష్ణకు ప్రాథమిక చికిత్స అందించి, గాయం స్వల్పమైనదేనని తెలపడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారనే వార్త తెలిసిన వెంటనే నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా భావోద్వేగమైన పోస్టులు పెట్టారు.

జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..

"గెట్ వెల్ సూన్ బాలా బాబాయ్.. మీరు త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఆశిస్తున్నాను. మీరు మళ్లీ పూర్తి ఫామ్‌లో సింహంలా గర్జించాలని కోరుకుంటున్నాను" అని ఎన్టీఆర్ ఆకాంక్షించారు.

కల్యాణ్ రామ్ ట్వీట్..

"త్వరగా కోలుకో బాబాయ్.. మీరు ఎంతగానో ప్రేమించే పనిని చేయడానికి చాలా తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్ మోడ్లోకి వస్తారని నమ్ముతున్నాను" అని కల్యాణ్ రామ్ పేర్కొన్నారు." అని కల్యాణ్ రామ్ ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలకృష్ణ ఆరోగ్యం స్థిరంగా ఉందని, కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని చిత్రబృందం వెల్లడించింది.

Next Story