జూలైలో బాక్సాఫీస్ జాతర.. 'కుబేర' షాక్‌కి ఇంకో షాట్‌ రావొచ్చా..?

by Bhanu |

జూన్‌లో విడుదలైన ‘కుబేర’ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర తుఫాను సృష్టించింది. సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్‌ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌ లోకి దూసుకెళ్లింది. ఖర్చు పరంగా భారీ సెట్లు లేకుండా, నటుల పారితోషికాలే ప్రధాన వ్యయం కావడంతో, ఈ చిత్రం భారీ లాభాల దిశగా పయనిస్తోంది.

జూలైలో బాక్సాఫీస్ జాతర.. కుబేర షాక్‌కి ఇంకో షాట్‌ రావొచ్చా..?
X

దిశ, ఎఫెక్ట్ : జూన్‌లో విడుదలైన ‘కుబేర’ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర తుఫాను సృష్టించింది. సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్‌ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌ లోకి దూసుకెళ్లింది. ఖర్చు పరంగా భారీ సెట్లు లేకుండా, నటుల పారితోషికాలే ప్రధాన వ్యయం కావడంతో, ఈ చిత్రం భారీ లాభాల దిశగా పయనిస్తోంది. కొంతకాలంగా నిరాశకు గురవుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ‘కుబేర’ ఊపిరి పీల్చినట్లైంది. ఇప్పుడు ప్రశ్న మాత్రం.. ఈ హవా జూలైలో కూడా కొనసాగుతుందా? సమాధానం.. ఖచ్చితంగా అవుననే అనిపిస్తోంది.

జూలై 4: నితిన్ ‘తమ్ముడు’ పవర్ పంచే ప్రయత్నం

ముందుగా జూలై 4న యూత్ స్టార్ నితిన్ నటించిన ‘తమ్ముడు’ ప్రేక్షకుల ముందుకి రానుంది. టైటిల్ చూస్తే ప‌వ‌న్ కళ్యాణ్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం నింపేలా ఉంది. ఈ టైటిల్‌నే కాకుండా, నితిన్ సైతం సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇటీవలి కాలంలో హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు ఇది కీలకమైన చిత్రం. పవన్ టైటిల్‌తో పాటు, హై ఎమోషన్‌తో నిండిన కంటెంట్‌తో ‘తమ్ముడు’ సక్సెస్‌ వైపు సాగుతుందని ఆశలు నెలకొన్నాయి.

జూలై 11: అనుష్క 'ఘాటీ' – ఆమె కంబ్యాక్ కెరటం

అనుష్కను మళ్లీ స్క్రీన్‌పై చూసే అవకాశం కోసం అభిమానులు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్నారు. జూలై 11న ‘ఘాటీ’ రూపంలో ఆమె తిరిగి వస్తోంది. పవర్‌ఫుల్ పాత్రల్లో అనుష్కను చూసి చాలాకాలం అయ్యింది. ఇప్పుడు ‘ఘాటీ’లో ఆమె అచ్చమైన మాస్ యాక్షన్‌ అవతారంలో కనిపించనుందని టాక్‌. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలు సృష్టిస్తోంది. అన్నీ అనుకూలిస్తే, ఈ చిత్రం అనుష్కకు మళ్లీ గ్లోరీ తీసుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

జూలై 24: హరిహర వీరమల్లు – పవన్ కల్యాణ్‌ ఫైర్ రీ ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' ఎట్టకేలకు జూలై 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఆలస్యానికి ఓ చెక్ పెడుతూ, భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. మొఘల్ సామ్రాజ్యంపై వీరమల్లు తిరుగుబాటు నేపథ్యంలో సాగే ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌ ఇప్పటికే భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ పవర్‌తో కలిపి, గ్రాండ్ విజువల్స్, చారిత్రక నేపథ్యం ఈ సినిమాను స్పెషల్‌ చేస్తోంది. ఇదే పవన్‌కు వేరే స్థాయిలో హిట్ తేల్చే సినిమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జూలైలో ‘కింగ్‌డమ్’ కూడా..?

విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్‌డమ్' కూడా జూలై చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫినిషింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచాయి. పవర్‌ఫుల్ పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి యూత్‌లో సాలిడ్ రెస్పాన్స్ ఉంది.

‘కుబేర’ ప్రభావం నుంచి తేరుకోకముందే జూలైలో మరోసారి బాక్సాఫీస్‌ ఊపిరి తీసుకునేలా ఉంది. నితిన్, అనుష్క, పవన్, విజయ్ లాంటి స్టార్స్‌ సినిమాలు వరుసగా వస్తుండటంతో.. ఇటు బోనాల జాతరతో పాటు సినిమాల జాతర కూడా పక్కా అనిపిస్తోంది. మరి ఈ సినిమాలన్నీ అంచనాలను అందుకుంటాయా? లేక ఏదైనా సర్‌ప్రైజ్‌ మాస్‌కు సిద్ధమా? అన్నది చూడాలి.

Next Story